

Dalit Sthree Sakthi
This year is momentous for Dalit Sthree Sakthi (DSS) as we completed 15 years of our journey in enabling dalit women empowerment. It's momentous in many ways, for the quantum of work turned out during the decade and half, for the evolution of DSS from a small band of 3/4 activists in 2006 to what it is now, quantitatively and qualitatively. The 15th anniversary of DSS is an opportune moment to look back and to assess the impact of our efforts.
These are the stories of struggle and resilience as told by Dalit woman and documented by Dalit Sthree Sakthi (DSS) during the period of 5 years from 2006. DSS took shape as an organization in the year 2005 with the goal of organizing dalit woman in the Telugu States to struggle for their rights and entitlements. In a state, where the successive governments and political parties are viewing dalit women only as vote banks and attempting to woo them with various monetary schemes and doles, it was thought necessary to awaken them to fight for justice and self-respect rather than for monetary benefits. The idea took root in the course of ‘campaign on violence against women’ that took place during the November 2004 in the background of International campaign on violence against women.
Law as an instrument of social change has always been an issue of serious debate among jurists, sociologists, social reformers and scholars of all hues. While the protagonists of social change through law assert that law plays a powerful role in bringing about social change; the skeptics argue that it is social change that precedes and paves the way for a law. The debate apart, the truth appears to lie somewhere in between.
భారతదేశంలో ఉద్యమ నేపథ్యం పరిశీలించినట్లయితే ఎన్నో హెచ్చుతగ్గులు పోరాటక్రమాలు అర్థమవుతాయి. అనేక ఉద్యమాలతో పాటు హక్కుల ఉద్యమాలు పెద్ద పాత్ర కలిగి ఉన్నాయి. హింస, అత్యాచారాలు, దాడులు జరిగినప్పుడు న్యాయపోరాటం చేయాలంటే తప్పనిసరిగా మేధావుల పాత్ర ఉండాలి. వారి నాయకత్వంలో ఉద్యమాలు జరిగేవి. ఉద్యమాలు కొందరి నాయకుల పర్యవేక్షణలో వారి నాయకత్వం కింద ఉండడం అనేది ఇంతవరకు చలామణి అయ్యింది. ఏది చెపితే ఆలా చెయ్యడం, ఎలా చెపితే అలా చేయడం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లడం దగ్గర నుండి మమ్ములను మేము రక్షించుకోగలం వరకు పోరాటాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మేధస్సు అనేది కొందరి సొత్తు కాదు, నాయకత్వం అనేది ఏ వర్గానికి సొంతం కాదు అనే ఉద్దేశంతో పునాది స్థాయి నుండి బలోపేతం అవ్వాలని, హింసలకు, వేదనలకు నిలయాలైన దళిత పల్లెలు మేల్కోవాలని అన్ని రంగాల్లో ప్రధాన స్రవంతిలోకి రావాలనే ఉద్దేశ్యంతో దళిత స్త్రీలను, దళిత బాలికలను చైతన్యవంతం చేసే పని 'దళిత స్త్రీ శక్తి' చేపట్టింది.
A Study Report
Situation Analysis of Dalit Girl Children, Anganwadis, Social Welfare Hostels and Government Schools in the State of A.P.
A Survey Report
Situation Analysis of Anganwadis, Social Welfare Hostels and Government Schools in the State of A.P.
The Scheduled Castes, Scheduled Tribes (Prevention of Atrocities) Act 1989 has been in force for the past 26 years. This Act came into existence in response to the demands of the Dalit Movement for a stringent punishment to the perpetrators of atrocities. This was a development over the earlier enactment, Protection of Civil Rights Act 1955. However, during the past 26 years of implementation of SC,ST (PoA) Act, 1989 it was noticed that there are many lacuna in the Act and dalit rights organizations felt that the Act should be amended to make it more effective.
Simplified English Version of the Act
Telugu Translation of the Act
అనేక తరాలుగా దోపిడీకి గురైన దళిత, గిరిజన కులాలు ఆర్థికంగా స్థిరపడడం కోసం రూపొందించబడిన చట్టం షెడ్యూల్డు కులాల/ తెగల ఉపప్రణాళికా చట్టం. ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూసిన కల ఈ చట్టం ద్వారా నెరవేరుతుందనే ఉద్దేశ్యంతో ఈ చట్టాన్ని తీసుకురావడం కోసం మేధావులు, సంఘాలు అనేక పోరాటాలు చేసాయి. దళిత, గిరిజనులకు కేటాయించిన నిధులు కొన్ని వేల కోట్లు వారికి దక్కకుండా పోయాయనీ, చట్టం రూపంలో అయితే పగడ్బందీగా అమలవుతుందనే ఆశతో ఈ చట్టం రూపుదాల్చింది. కానీ చట్టం అయినా, పథకాలయినా , దళిత గిరిజనుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు లేవు, ప్రస్తుతం ఈ చట్టం కూడా అంతే. ఈ చట్టాన్ని తెలుగులో అనువదించడానికి గల కారణం ఈ చట్టంలో ఉన్న అంశాలు, చేర్చాల్సిన అంశాలు, అమలు పరచుకోవలసిన పద్ధతులు అవగాహన చేసుకుంటే ముందుకు వెళ్లే మార్గాలు అవగతమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, సమూహాలుగా సమస్యలు పరిష్కరించుకునే దశ నుండి మన జాతుల, తరాల అభ్యున్నతి కోసం ఆలోచించాలి. మన పిల్లల జీవితాలను బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలి. దళిత, గిరిజన స్త్రీల, బాలికల జీవితాలను ప్రధాన స్రవంతిలోకి తేవాలి. అందుకు ఈ చట్టాన్ని మన హక్కుగా గుర్తించి దాన్ని ఒక ఆయుధంగా మలచుకోవాలి. ఆ ఆయుధానికి మరింత పదును పెట్టాలంటే మనం జ్ఞానవంతమయి కలిసికట్టుగా పోరాడాలి.
దళిత మహిళా కార్యకర్తలు, మహిళా కలయికల నాయకులు, సభ్యులు, యువత తమ తమ ప్రాంతాల్లో హక్కుల ఉల్లంఘన సంఘటనలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. వీరందరికీ వివిధ సమయాల్లో వివిధ ప్రత్యేక చట్టాల గురించి శిక్షణలిచ్చాము. మానవ హక్కులు, రాజ్యాంగ హక్కులపై అవగాహనను ఈ శిక్షణల ద్వారా కలిపించాం. అత్యంత అవసరమైన ప్రత్యేక చట్టం, షెడ్యూల్డు కులాల, తెగల పై అత్యాచారాల నిరోధక చట్టం అనువదించి కార్యకర్తలందరికి వేల ప్రతులను అందించి అందరికీ అందుబాటులోకి తెచ్చాం. రాజ్యాంగ హక్కుల గురించి శిక్షణ ఇచ్చినా, రాజ్యాంగం గురించి సంక్షిప్తంగా పరిచయం చేసే పుస్తకం అందుబాటులోనికి తెస్తే బాగుంటుందని ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాము. ఈ చిన్ని పుస్తకంలో రాజ్యాంగం అంటే ఏమిటి? రాజ్యాంగంలో పొందుపర్చిన వివిధ హక్కులేమిటి? రాజ్యాంగం మొత్తంలో వున్న వివిధ అంశాలు ఏమిటి? అనే విషయాలు సంక్షిప్తంగా తెలియజేస్తున్నాము. ఏదైనా ఒక అంశం పై లోతుగా అధ్యయనం చెయ్యాలనుకున్నవారు రాజ్యాంగం పై వ్రాయబడిన గ్రంధాలను చదువుకోవచ్చు. ఈ పుస్తకం ద్వారా మన హక్కుల కార్యకర్తలందరికీ రాజ్యాంగం పై ఒక కనీస అవగాహనా కల్పించాలన్నదే మా ఉద్దేశ్యం.